బంగ్లాదేశ్ నుండి వచ్చినవాళ్లకు SC సర్టిఫికేట్: BJP MLA
TG: బంగ్లాదేశ్ నుండి బెంగాల్ మీదుగా తెలంగాణకు వలస వచ్చిన కార్మికులకు ఎస్సీ ధ్రువీకరణ సర్టిఫికేట్ ఇవ్వాలని సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు అసెంబ్లీలో కోరారు. తమ నియోజకవర్గంలోని 15 గ్రామాల్లో 20 వేల మంది బంగ్లాదేశ్ కార్మికులున్నారని తెలిపారు. గతంలో వారికి ఎస్సీ ధ్రువీకరణ సర్టిఫికేట్ వచ్చేదని, ప్రస్తుతం ఆ సర్టిఫికేట్‌ను మళ్లీ ఇవ్వాలని కోరారు.


