← Back to news

BCలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి: శ్రీనివాస్‌

By dk· 15 Aug 2026· మంచిర్యాల జిల్లా
BCలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి: శ్రీనివాస్‌

TG: కాంగ్రెస్‌ ప్రభుత్వం BCలకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్‌ మంచిర్యాల నుంచి హాజీపూర్‌ వరకు సైకిల్‌ యాత్ర చేపట్టారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా BC డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలపై స్పష్టమైన చర్యలు కనిపించడంలేదని విమర్శించారు. స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లు, BC సబ్‌ప్లాన్‌, కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు, రుణాలు, బీసీ భవనాల నిర్మాణం, తదితర హామీలను వెంటనే అమలు చేయాలన్నారు.

More in TG