వరికోత మిషన్ పేరుతో రైతుకు స్కామ్..

TG : మెదక్ జిల్లా బస్వాపూర్ గ్రామానికి చెందిన రైతు భూపాల్‌కి ఒక గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి, వరికోత మిషన్ పంపిస్తానని చెప్పి డీజిల్ ఖర్చుల కోసం రూ.30 వేలు ఫోన్ పే చేయించుకున్నాడు. డబ్బులు పడగానే ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. మోసపోయానని తెలిసిన వెంటనే రైతు సైబర్ క్రైమ్‌కు కంప్లైంట్ చేయడంతో, పోలీసులు స్కామర్ అకౌంట్‌లోని రూ.21 వేలు ఫ్రీజ్ చేశారు. ఆన్‌లైన్‌లో అపరిచితులు యంత్రాలు, విత్తనాల పేరుతో డబ్బులడిగితే నమ్మొద్దని పోలీసులు సూచించారు.



