ఆయిల్‌పామ్ సాగులో రోబోటిక్ సాయం

TG: వ్యవసాయ పనులకు కూలీలు దొరకడం కష్టంగా మారుతున్న నేపథ్యంలో ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటల సాగును సులభతరం చేసేందుకు తెలంగాణలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. కొండా లక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన AI ఆధారిత రోబోటిక్ యంత్రం ఎక్స్‌మిషిన్‌ను హైదరాబాద్ శివారులోని ఆయిల్‌పామ్ తోటలో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఈ యంత్రం మనుషుల సహాయం లేకుండా రెండుగంటల్లో ఎకరం పొలంలో సాళ్లు తీసింది. కూరగాయలు, పూలు, ఔషధ మొక్కల సాగుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని VC రాజిరెడ్డి తెలిపారు.



