← Back to news

కొండమల్లపల్లి ఉపాధ్యాయురాలు రూప రెడ్డి హత్యపై నిరసన

By Mallikarjuna· 21 Aug 2026

కొండమల్లపల్లి ఉపాధ్యాయురాలు రూపారెడ్డి హత్యను ఖండిస్తూ, జడ్చర్లలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఎంఈఓ కార్యాలయం నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు హత్యకు కారణమైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం జడ్చర్ల తహసీల్దార్‌ (ఎంఆర్వో)కు వినతిపత్రం అందజేశారు. ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు.

More in Local