ఇరాన్ అణు వివాదంలో కొత్త టెన్షన్.. UNలోకి?

ఇరాన్ అణు అంశాన్ని UN Security Councilకి రిపోర్ట్ చేసేలా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ కొత్త తీర్మానం సిద్ధం చేస్తున్నాయి. అంతర్జాతీయ అణు సంస్థ IAEAకి ఇరాన్ అణు పదార్థాలపై పూర్తి సమాచారం ఇవ్వడం లేదని, తనిఖీలకు పరిమితులు ఉన్నాయని పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్నాయి. 2025లో ఇరాన్ అణు బాధ్యతలు పాటించడం లేదని IAEA బోర్డు గుర్తించడంతో వివాదం ముదిరింది. తీర్మానం ఆమోదమైతే విషయం UN భద్రతా మండలికి వెళ్లొచ్చు. ఇరాన్‌కు రష్యా, చైనా మద్దతుగా వీటో చేసే అవకాశం ఉండటంతో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.

