మైనారిటీ పాఠశాలలో వైద్య శిబిరం

TG: విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వరంగల్ జిల్లా నర్సంపేటలోని మైనారిటీ పాఠశాలలో ఆర్‌బీఎస్‌కే బృందం ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేశారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, ప్రథమ చికిత్స పద్ధతులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శ్రీపాల మాట్లాడుతూ వైద్య శిబిరం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు.

