← Back to news

నిత్యావసర ధరలపై ఐద్వా ధర్నా

By Aidwa MADHAVI· 2h ago
నిత్యావసర ధరలపై ఐద్వా ధర్నా

AP: విశాఖపట్నం జిల్లాలో నిత్యావసర వస్తువుల ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. బియ్యం, పప్పులు, వంట నూనెలు, పంచదార తదితర ధరలను నియంత్రించాలని నాయకులు డిమాండ్ చేశారు. బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలు, కృత్రిమ కొరతను అరికట్టాలని కోరారు. రేషన్ వ్యవస్థను బలోపేతం చేసి 14 నిత్యావసర వస్తువులను రేషన్ ద్వారా అందించాలని, ప్రతి కుటుంబానికి నెలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

నిత్యావసర ధరలపై ఐద్వా ధర్నా
నిత్యావసర ధరలపై ఐద్వా ధర్నా

More in Local