జిల్లాలో మెరుగుపడిన విద్యుత్ మౌలిక సదుపాయాలు

జగిత్యాల జిల్లాలో గత రెండున్నరేళ్లలో విద్యుత్ మౌలిక వసతులు బలోపేతం చేసినట్లు విద్యుత్ శాఖ SE బి.సుదర్శనం తెలిపారు. 8 పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంపు, 11 అదనపు పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, 1,160 ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంపు, 736 కొత్తవి ఏర్పాటు, అలాగే 2 కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్లు, 5 కెపాసిటర్ బ్యాంకులు, 49 వీసీబీలు ఏర్పాటు చేశామన్నారు.


