← Back to news

దీక్షకు సంఘీభావం తెలిపిన సీపీఐ, BJP నేతలు

By BOLAGANI SAIDULU· 1d ago· Vidyanagar, Suryapet, Suryapet
దీక్షకు సంఘీభావం తెలిపిన సీపీఐ, BJP నేతలు

సూర్యాపేటలోని ధర్నా చౌక్‌లో బుల్లెట్ ట్రైన్ సాధన సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్ష మంగళవారం 47వ రోజుకు చేరింది. ఈ దీక్షకు సీపీఐ(ఎంఎల్) జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్, BJP జిల్లా ప్రధాన కార్యదర్శి చలమల్ల నరసింహ సంఘీభావం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన దీక్షలో పాల్గొన్న వారికి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బుల్లెట్ ట్రైన్ సాధనే ధ్యేయంగా ఉద్యమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు.

More in Local