భీమదేవరపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ క్రాస్ సమీపంలో మంగళవారం సాయంత్రం కారు అదుపుతప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం ధాటికి కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. అయితే ఇద్దరికీ ప్రాణాపాయం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.



