← Back to news

ట్రక్‌ బోల్తా.. బాటిళ్లు మాయం

By Lokesh· 2h ago

బీహార్‌లోని అరరియా జిల్లాలో మద్యం లోడ్‌తో వెళ్తున్న మినీ ట్రక్‌ ఆక్సిడెంట్‌కు గురైంది. రాణిగంజ్‌ ప్రాంతంలోని ఖర్హట్‌ టోల్‌ ప్లాజా దగ్గర ట్రక్‌ డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత డ్రైవర్‌, క్లీనర్‌ పారిపోయారు. ట్రక్‌లో మద్యం ఉందని తెలియడంతో అక్కడికి చేరుకున్న కొందరు బాటిళ్లు, కార్టన్లు ఎత్తుకెళ్లారు. ఈ ఇన్సిడెంట్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు ట్రక్‌ను స్వాధీనం చేసుకుని, వీడియోల ఆధారంగా మద్యం ఎత్తుకెళ్లిన వారిని గుర్తిస్తున్నారు.

More in National