మీ పిల్లలకు ఇలాంటి ఫుడ్ పెడతారా?.. అభిజీత్ దీప్కే
గవర్నమెంట్ స్కూళ్లలో పిల్లలకు Expired ఫుడ్ అందిస్తున్నారంటూ CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ‘X’ లో పోస్ట్ చేశారు. 'ఇలాంటి ఫుడ్‌ను అధికారంలో ఉన్నవాళ్లు తమ పిల్లలకు పెడతారా? నిజాన్ని బయటపెడితే FIRలు పెట్టినా పర్లేదు.. నిజాన్ని ఎక్స్‌పోజ్ చేయడం ఆపము' అంటూ వీడియోలో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం <a href="https://x.com/abhijeet_dipke/status/2093584722295394416">సోషల్ మీడియాలో</a> చర్చకు దారితీస్తోంది.



