ఎయిర్ ఫోర్స్ నుంచి సువేందు షాడో వరకు.. ఎవరీ చంద్రనాథ్ రథ్

సువేందు అధికారి PA చంద్రనాథ్ రథ్ నేపథ్యం చాలా ఆసక్తికరమైంది. IAFలో 20ఏళ్లు పనిచేసి రిటైర్ అయ్యాక రాజకీయాల్లోకి వచ్చారు. 2019 నుండి సువేందు అధికారికి అత్యంత నమ్మకస్తుడిగా ఒక నీడలా ఉన్నారు. ఎన్నికల వ్యూహాలు, సమన్వయ బాధ్యతలు చూస్తూ ట్రబుల్ షూటర్ గా మారారు. రామకృష్ణ మిషన్ ఆశయాలతో ప్రభావితుడైన చంద్రనాథ్ Soft Spoken వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. సువేందు అధికారి కుటుంబానికి, రథ్ కుటుంబానికి విడదీయలేని అనుబంధం ఉంది. చంద్రనాథ్ మరణంతో సువేందు అధికారికి కుడిభుజం కోల్పోయినట్టయింది.



