← Back to news

"బారికేడ్లు తీసేయండి": సుప్రీంకోర్టు

By Krishna· 2h ago
"బారికేడ్లు తీసేయండి": సుప్రీంకోర్టు

ఢిల్లీలో పరిస్థితులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఇంటర్నెట్ సర్వీసులను తిరిగి ప్రారంభించాలనీ, బారికేడ్లను తొలగించాలని పోలీసుల్ని ఆదేశించింది. అలాగే మెట్రో సర్వీసులను పూర్తిగా నడపాలని ఆర్డరేసింది. లా అండ్ ఆర్డర్‌కి ఇబ్బంది కలగనంతవరకూ సర్వీసులు నడపాలని సూచించింది. ఇంకా లాయర్ల విధులకు పోలీసులు ఆటంకం కలిగించవద్దని సుప్రీం స్పష్టం చేసింది. ఇక పోలీసులు వెనక్కి తగ్గే ఛాన్స్ ఉంది. బారికేడ్లు తొలగిస్తే, ఢిల్లీ ప్రజలకు స్వేచ్ఛ లభిస్తుంది.

More in National