డెడ్‌బాడీలను గుర్తించడానికి నాలుగురోజులు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన వారిని గుర్తించడం ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. నిన్న రాత్రి నుంచి కేజీహెచ్‌లోనే డెడ్‌బాడీలను భద్రపరచగా.. ఇప్పటి వరకూ ఇద్దరి మృతదేహాలను మాత్రమే వారి కుటుంబసభ్యులు గుర్తించారు. భానుకుమార్, రమణ డెడ్‌బాడీలను కుటుంబసభ్యులు గుర్తించగా.. మిగతా వారు గుర్తుపట్టలేనంతగా కాలిపోయారని కేజీహెచ్ డాక్టర్లు తెలిపారు. కుటుంబసభ్యులు పోలీసుల సమక్షంలో తమవారిని గుర్తుపడితే డీఎన్ఏ టెస్టులు చేస్తామని, ఆ రిపోర్టులు వచ్చేందుకు మరో నాలుగురోజుల సమయం పడుతుందని తెలిపారు.



