సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం

TG: సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బాచుపల్లి సమీపంలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో నాలుగేళ్ల పసికందుతో సహా మొత్తం ముగ్గురు స్పాట్‌లోనే మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి హైదరాబాద్‌కు కారులో బయలుదేరగా ఈ ఘటన జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.



