‘రెంట్ ఏ గర్బా పార్ట్‌నర్’.. సైబర్ పోలీసుల వార్నింగ్

నవరాత్రులు దగ్గరపడుతున్న వేళ.. ‘రెంట్ ఏ గర్బా పార్ట్‌నర్’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. గర్బా ఆడేందుకు పార్ట్‌నర్‌ను అద్దెకు తీసుకోవచ్చంటూ 500 రూపాయల నుంచి 6,500 రూపాయల వరకు ప్యాకేజీలు పెడుతున్నారు. అయితే వీటి వెనుక ఫిషింగ్, పేమెంట్ స్కామ్‌లు ఉండొచ్చని నేషనల్ సైబర్ క్రైమ్ పోలీసులు చెక్ చేస్తున్నారు. తెలియని సోషల్ మీడియా అకౌంట్లకు డబ్బులు పంపొద్దని, అనుమానాస్పద పేమెంట్ లింక్స్ క్లిక్ చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు.


