← Back to news

స్టూడెంట్స్‌తో డ్యామ్‌లో స్నానం.. ప్రిన్సిపాల్‌పై యాక్షన్!

By Mahesh· 24 Aug 2026· Rajasthan

రాజస్థాన్‌ రాష్ట్రం అల్వార్ జిల్లాలో స్టూడెంట్స్‌తో కలిసి డ్యామ్‌లో స్నానం చేసినట్లు Govt. స్కూల్ ప్రిన్సిపాల్ లాల్‌చంద్ మీనాపై ఆరోపణలొచ్చాయి. దీంతో అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. స్టూడెంట్స్‌తో ఆయన డ్యామ్‌లో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ యాక్షన్ తీసుకున్నారు. ఆగస్ట్ 15న 200 మందికి పైగా స్టూడెంట్స్‌ను డ్యామ్‌కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ స్నానం చేయడంపై బ్యాన్ ఉన్నప్పటికీ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రిన్సిపాల్‌పై డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీకు ఆదేశించారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 6h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.