టీచర్‌ని కాల్చి చంపాడు.. ఇదేం ప్రేమ?
ఉత్తరప్రదేశ్, లఖింపూర్ ఖేరీలోని చిల్డ్రన్స్ అకాడమీ స్కూల్‌లో సోమవారం ఉదయం 11:30కి భయంకర ఘటన జరిగింది. 26 ఏళ్ల టీచర్ నిషాత్ ఫాతిమాను.. మాజీ లవర్, 28 ఏళ్ల మహమ్మద్ సౌద్ అన్సారీ గన్‌తో కాల్చి చంపాడు. కొంతకాలంగా ఆమెను పెళ్లికి బలవంతం చేస్తూ, వేధిస్తున్న అతను.. స్కూల్‌లోకి చొచ్చుకువచ్చి స్టూడెంట్స్ ముందే ఆమెను పై అంతస్తుకు లాక్కెళ్లి 4 రౌండ్లు కాల్చి హత్య చేశాడు. తర్వాత తాను కూడా కాల్చుకుని చనిపోయాడు. బాధిత ఫ్యామిలీ అతని పేరెంట్స్‌పై కేసు పెట్టింది.


