మెరిట్ విద్యార్థులకు స్కూటర్లు

మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్.. గవర్నమెంట్ స్కూళ్లలోని 7,400కి పైగా మెరిట్ విద్యార్థులకు "CM Scooty Scheme" కింద స్కూటర్లు, ఆర్థిక సాయం అందించారు. భోపాల్‌లోని సుభాష్ ఎక్సలెన్స్ స్కూల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మాగ్జిమం 1లక్షా 20వేలు, పెట్రోల్ వెహికిల్‌కి 90వేల దాకా సహాయం లభిస్తోంది. ఇందులో రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, హెల్మెట్లు కూడా కవర్ అవుతాయి. ఈ సాయం పొందాలంటే 70% మార్కులు, ఫస్ట్ ర్యాంక్ అవసరం. ఏపీ, తెలంగాణలో కూడా ఇలా చెయ్యాలంటారా?


