జిల్లా బెస్ట్ టీచర్‌గా సాతూరి ప్రసాద్

TG హన్మకొండ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా సాతూరి ప్రసాద్ ఎంపికయ్యారు. భీమదేవరపల్లి మండలం కొత్తకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సాతూరి ప్రసాద్‌ను తెలంగాణ ప్రభుత్వం హన్మకొండ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేసింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రకటించిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో ఆయనకు చోటు దక్కింది. జిల్లాలో నిర్వహించనున్న గురుపూజోత్సవ కార్యక్రమంలో సాతూరి ప్రసాద్ అవార్డును అందుకోనున్నారు. పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.


