← Back to news

ప్రమాదకరంగా కరెంట్ తీగలు.. రైతుల ఆందోళన

By DK· 2h ago
ప్రమాదకరంగా కరెంట్ తీగలు.. రైతుల ఆందోళన

TG సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికందే ఎత్తులో తీగలు ఉండటంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రానికి నిత్యం ట్రాక్టర్లు, లారీలు వస్తుండటంతో ప్రమాదం మరింత పొంచి ఉందని రైతు కంతుల నర్సయ్య తెలిపారు. విద్యుత్ తీగలను సురక్షితంగా పైకి మార్చి, మధ్యలో విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయాలని స్థానిక రైతులు అధికారులను కోరుతున్నారు.

More in Local