← Back to news

సారీ..అంబులెన్స్‌లో డీజిల్ లేదు!

By Balakrishna· 25 Jul 2026
సారీ..అంబులెన్స్‌లో డీజిల్ లేదు!

AP: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం పాతూరుగుంటకు చెందిన గర్భిణి లక్ష్మి అంబులెన్స్ సౌకర్యం లేకపోవడంతో ఇంటి వద్దే ప్రసవించింది. బిడ్డ ఆరోగ్యం కోసం చింతపల్లి హాస్పిటల్‌కి 45 కి.మీ బస్సులో..ఆపై 13 కి.మీలు జీపులో ప్రయాణించి హాస్పిటల్‌కి చేరుకున్నారు. చికిత్స తర్వాత ఇంటికి వెళ్లేందుకు అంబులెన్స్‌ను కోరగా 'డీజిల్ లేదు' అని సిబ్బంది సమాధానమిచ్చారు. దీంతో భర్త భాస్కరరావు జోరువానలో బైక్‌పై 20 కి.మీ. మట్టి రోడ్డుపై ఆమెను తీసుకెళ్లాల్సి వచ్చింది.

More in News