విజయ్ ప్రమాణ స్వీకారంపై సందిగ్ధత.. లోక్ భవన్ వద్ద ఆందోళనకారుల అరెస్ట్.
తమిళనాడులో రాజకీయ సెగలు రాజుకున్నాయి. టీవీకే (TVK) అధినేత విజయ్ ప్రమాణ స్వీకారంపై కొనసాగుతున్న సందిగ్ధత నేపథ్యంలో, చెన్నైలోని లోక్ భవన్ వద్ద ఆందోళన చేస్తున్న పార్టీ మద్దతుదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విజయ్‌ను ఆహ్వానించాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. గవర్నర్, పార్టీ మధ్య మెజారిటీ నిరూపణపై ప్రతిష్టంభన ఏర్పడటంతో చెన్నైలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసి తరలించారు.



