← Back to news

ఏనుగు పిల్లను చూసేందుకు వెళ్లి.. కాళ్ళ కిందపడి వ్యక్తి మృతి

By Mahesh· 23 Aug 2026· Jharkhand

జార్ఖండ్‌ రాష్ట్రం రామ్‌గఢ్‌ గోబర్దరహా ఫారెస్ట్ ఏరియాలో దారుణ ఘటన జరిగింది. నవజాత (ఇప్పుడే పుట్టిన) ఏనుగు పిల్లను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి వెళ్లారు. కొందరు దగ్గరగా వెళ్లి వీడియోలు, రీల్స్ తీసేందుకు ప్రయత్నించారు. దీంతో పిల్లకు దగ్గరలో ఉన్న తల్లి ఏనుగు జనంపైకి దూసుకొచ్చింది. భయంతో పారిపోతుండగా యశ్వంత్ మహతో అనే యువకుడి బైక్ కంట్రోల్ తప్పి పడిపోయాడు. ఏనుగు కాళ్ళ కింద పడడంతో ఆ వ్యక్తి మరణించాడు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 6h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.