← Back to news

సౌదీలో నిర్మల్ వాసుల గణేష్ నిమజ్జనం

By Jabeer· 2h ago· Al Faysaliyah, Dammam, Dammam Principality

సౌదీ అరేబియాలోనూ మన తెలుగువారు గణేష్ నిమజ్జనాలు చేశారు. సౌదీలోని తూర్పు ప్రాంతానికి (Eastern Province) రాజధానిగా, ఒక ప్రముఖ రేవు (పోర్ట్) నగరంగా విరాజిల్లుతున్న దమ్మము నగరంలోని సికో ప్రాంతంలో ఉమ్మడి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా వాసులు గౌరీ శంకర్, తారక్, తేజ పళ్లెం, మల్లేష్ వినాయక చవితి నిమజ్జన వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విదేశాల్లోనూ మన సంస్కృతిని చాటుతూ భక్తులు శోభాయాత్రలో పాల్గొని గణనాథునికి వీడ్కోలు పలికారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో ప్రవాస భారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

More in World