← Back to news

ఇందిరమ్మ ఇండ్లు జనావాసాల పరిధిలోనే ఉండాలి: రేవంత్ రెడ్డి

By Balakrishna· 24 Jul 2026
ఇందిరమ్మ ఇండ్లు జనావాసాల పరిధిలోనే ఉండాలి:  రేవంత్ రెడ్డి

TG: హైదరాబాద్‌ కోర్ అర్బన్ రీజియన్(CURE) పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇండ్లు ప్రజలకు అందుబాటులో ఉండేలా నిర్మించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పేదలకు ఊరికి దూరంగా కాకుండా అన్ని సదుపాయాలు ఉండేలా ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు. ORR లోపల వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలను తక్షణమే గుర్తించాలని అధికారులకు సూచించారు. ఆ స్థలాలను పేదల ఇళ్ల నిర్మాణానికి వినియోగించుకోవాలని స్పష్టం చేశారు.

ఇందిరమ్మ ఇండ్లు జనావాసాల పరిధిలోనే ఉండాలి:  రేవంత్ రెడ్డి

More in News