ఇండియాలో Apple Pay..!

ఇండియాలో Apple Pay సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం Axis Bank Visa, Mastercard క్రెడిట్ కార్డులను iPhone, iPad, Apple Watchలో Apple Walletకు యాడ్ చేసుకోవచ్చు. షాపుల్లో NFC ద్వారా ట్యాప్ చేసి, యాప్స్, వెబ్‌సైట్లలో కూడా పేమెంట్స్ చెయ్యొచ్చు. Face ID, Touch ID లేదా పాస్‌కోడ్‌తో పేమెంట్‌ను వెరిఫై చేసే వీలుంది. ప్రస్తుతానికి RuPay కార్డులు, UPIకి సపోర్ట్ లేదు. ఇతర బ్యాంకుల కార్డులకు కూడా ఇంకా సపోర్ట్ లేదు. Macకి సపోర్ట్ త్వరలో రానుంది. 'యాపిల్ పే'ని విదేశాల్లోనూ వాడొచ్చు.



