← Back to news

సెప్టెంబర్ 12న రెండు తరాల కవిసంగమం

By Vishi· 2h ago
సెప్టెంబర్ 12న రెండు తరాల కవిసంగమం

TG: కవిసంగమం ఆధ్వర్యంలో రెండుతరాల కవులను ఒకే వేదికపై తీసుకువచ్చే ప్రత్యేక కవిసమ్మేళనం ‘రెండుతరాల కవిసంగమం – సిరీస్-47’ సెప్టెంబర్ 12, 2026న జరుగుతోంది. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని కోఠి, సుల్తాన్‌బజార్(రాంకోటి)లో ఉన్న శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయంలో సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. రెండు తరాలకు చెందిన కవులు కాంచనపల్లి గోవర్ధన్‌రాజు, ఫణిమాధవి కన్నోజు, గంగిరెడ్డి విశ్వనాథరెడ్డి, దండు వెంకట్రాములు, స్వప్న కొండమడుగు తమ కవిత్వాన్ని వినిపిస్తారు.

More in Arts/Literature

స్త్రీల గర్భం, స్వేచ్ఛపై సామాజిక వ్యాఖ్యానం
Arts/Literature· 3d ago

స్త్రీల గర్భం, స్వేచ్ఛపై సామాజిక వ్యాఖ్యానం

ఫెమినిస్ట్ స్టడీ సర్కిల్ ప్రపంచ స్త్రీవాద సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించింది. ఇటాలియన్ రచయిత్రి ఒరియనా ఫాలసి రాసిన ‘Letter to a Child Never Born’ పుస్తకాన్ని ఓల్గా తెలుగులో అనువాదం చేశారు. తల్లి తన కడుపులో బిడ్డ ఉన్నట్టు గుర్తించినప్పటి నుంచి, అండం గర్భంలో పెరిగి రూపం మారే ప్రక్రియను ఇందులో వివరంగా చెప్పారు. ఇది కేవలం శరీరం గురించి రాసిన రచనే కాదు, సామాజిక వ్యాఖ్యానం కూడా. పితృస్వామ్యం మన ఆచారాలు, భాష, సంస్కృతులను ఎలా తయారు చేసిందో ఈ పుస్తకం చెబుతుంది. పుస్తకం ధర రూ.100. కొనే <a href="https://www.telugubooks.in/products/puttani-biddaku-thalli-uttharam?srsltid=AfmBOorDrAEUy8FkbTr9Tubb4BId_N3ZPRpD-RxM8kBlKq7YQfh7Ni_b">లింక్</a>.