← Back to news

బస్సు నడుపుతూ ఫోన్.. డ్రైవర్‌‌పై వేటు

By DK· 1 Aug 2026· చిత్తూరు జిల్లా
బస్సు నడుపుతూ ఫోన్..  డ్రైవర్‌‌పై వేటు

AP: చిత్తూరు జిల్లా పలమనేరు-మదనపల్లె మార్గంలో బస్సు నడుపుతూ సెల్‌ఫోన్ చూస్తున్న డ్రైవర్‌పై RTC యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యాన్ని బస్సులోని ఓ ప్రయాణికుడు వీడియో తీసి ఉన్నతాధికారులకు పంపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మంత్రి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి చేరగా, ప్రయాణికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేస్తూ తక్షణ చర్యలకు ఆదేశించారు. విచారణ అనంతరం పలమనేరు డిపోకు చెందిన హైర్ సర్వీస్ బస్సు డ్రైవర్ కె. గణేష్‌కుమార్‌ను విధుల నుంచి తొలగించారు.

More in AP