← Back to news

పిల్లి అనుకుని వెళ్తే పాప బయటపడింది

By Charvaka· 5d ago· BBC Telugu
పిల్లి అనుకుని వెళ్తే పాప బయటపడింది

నేపాల్ భీకర వరదల తర్వాత రెస్క్యూ టీం ప్రాణాలతో ఉన్న వారి కోసం వెతుకుతోంది. రాసువా జిల్లాలోని స్యాబ్రుబేసి దగ్గర శిథిలాల కింద ఏదో శబ్ధం రావడంతో పిల్లి కావొచ్చని అక్కడ తవ్వారు. తీరా చూస్తే ఆ శబ్దం ఐదేళ్ల పసిపాప మనీషాది. షాక్ తిన్న రెస్క్యూ టీం రెండు గంటల పాటు కష్టపడి పాపను సేఫ్ గా బయటికి తీసుకొచ్చారు. వెంటనే హెలికాప్టర్‌లో కాఠ్‌మాండూలోని టీచింగ్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడే పాప తన తల్లిదండ్రుల్ని కలుసుకుంది. ఈ విషాదంలో ఆదివారం నాటికి మృతుల సంఖ్య 752కు చేరింది. 2502 మంది కనిపించకుండా పోయారు.

More in General