సాహిల్ కేసులో డీన్‌పై సస్పెన్షన్ వేటు

సాహిల్ వాకోడే అనే స్టూడెంట్ సూసైడ్ కేసులో IIT బాంబే కీలక నిర్ణయం తీసుకుంది. స్టూడెంట్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ సూర్యనారాయణ దూల్లాను వెంటనే సస్పెండ్ చేసింది. కేసులో ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు ఆయనపై తర్వాతి చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ షిరీష్ కేదారే తెలిపారు. సాహిల్ మృతిపై గతంలో ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు IIT బాంబే క్షమాపణ చెప్పింది. ఇన్వెస్టిగేషన్ పూర్తికాకముందే ఘటనపై వివరాలు చెప్పడం తప్పేనని తెలిపింది.



