IIT బాంబేలో స్టూడెంట్ సూసైడ్‌కి కారణమేంటి?
IIT బాంబేలో రెండో సంవత్సరం ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ చేస్తున్న <a href="https://www.theclearcutnews.com/n/VfLTJ4B">విద్యార్థి సాహిల్ వాకోడ్</a>.. సెప్టెంబర్ 18న హాస్టల్ గదిలో సూసైడ్ చేసుకోవడంతో క్యాంపస్‌లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మిడ్-సెమిస్టర్ పరీక్షలో మొబైల్‌లో ChatGPT వాడి, పట్టుబడిన తర్వాత <a href="https://www.theclearcutnews.com/n/TzRu5YT">ఆయన మరణించారు</a>. ఐతే.. పరీక్ష ఇన్విజిలేటర్, డీన్ సుర్యనారాయణ డూల్లా.. కులవివక్ష, హింసకు పాల్పడ్డారని కుటుంబం ఆరోపిస్తోంది. FIR నమోదైంది. సంస్థ, డూల్లాను డీన్ పదవి నుంచి సస్పెండ్ చేసి క్షమాపణ చెప్పింది. క్రైమ్ బ్రాంచ్ విచారణ కొనసాగుతోంది.


