← Back to news

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై నిర్లక్ష్యం: గుడివాడ అమర్‌నాథ్

By -· 8 Jun 2026

AP: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం జరిగి, ఉద్యోగులు మరణించిన ఘటనకు యాజమాన్యం వ్యవహారశైలే కారణమని ఆరోపించారు. ప్రభుత్వ అలసత్వం వల్లే ప్లాంట్‌లో కార్మికుల భద్రత గాల్లో కలిసిపోతోందని చెప్పారు. తక్షణమే పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

More in AP