← Back to news

ధర్మపురి లక్ష్మీనరసింహుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు

By Srikanth Goud· 5h ago· Jagitial, Jagitial, Jagitial
ధర్మపురి లక్ష్మీనరసింహుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు

భాద్రపద మాసం శనివారం సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తొలుత పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు.. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని, అనుబంధ ఆలయాల్లోని దేవతామూర్తులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ అధికారులు అందుకు అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు చేశారు. భక్తులకు దర్శనం, ఇతర సౌకర్యాల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు.

ధర్మపురి లక్ష్మీనరసింహుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు

More in Local