గోల్డ్ చైన్ కోసం హోటల్ రూమ్‌లో శవమయింది

TG:మియాపూర్‌లో పీజీ మెడికల్ స్టూడెంట్ సృజన అనుమానాస్పదంగా మృతి చెందారు. పీడియాట్రిక్స్ PG ఫస్టియర్ చదువుతున్న ఆమెకు రవితో MBBS టైంలో పరిచయం ఏర్పడింది. బంగారు గొలుసు తిరిగి ఇవ్వాలని కోరడంతో రవి హైదరాబాద్‌కు రమ్మని చెప్పినట్లు సమాచారం. సెప్టెంబర్ 30న ఆమె మియాపూర్‌కు వచ్చింది. ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో కుటుంబసభ్యులు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు హోటల్ రూమ్‌లో సృజన మృతదేహాన్ని గుర్తించారు. కేసుపై ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది.
