← Back to news

డైట్ మారితే వయసు తగ్గుతుందా?!

By Sahani· 1d ago
డైట్ మారితే వయసు తగ్గుతుందా?!

వయసు పైబడిన వారు తమ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం ద్వారా ఏజింగ్ ప్రాసెస్‌ను రివర్స్ చేయవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీ రీసెర్చర్స్ ప్రకారం, 65 నుండి 75 ఏళ్ల వయసు ఉన్నవారు డైలీ తినే ఫుడ్లో ఫ్యాట్ లేదా యానిమల్ ప్రొటీన్ తగ్గించడం వల్ల కేవలం 4 వారాల్లోనే వారి బయలాజికల్ ఏజ్ తగ్గినట్లు గుర్తించారు. ఈ బయలాజికల్ ఏజ్ అనేది మనిషి పుట్టిన ఏళ్లను బట్టి కాకుండా వారి హెల్త్ కండిషన్‌ను బట్టి డిసైడ్ అవుతుంది.

More in Health

వర్కౌట్‌ చేస్తే లగ్జరీ గిఫ్ట్‌లు.. ఉద్యోగులకు కంపెనీ ఆఫర్‌
Health· 14h ago

వర్కౌట్‌ చేస్తే లగ్జరీ గిఫ్ట్‌లు.. ఉద్యోగులకు కంపెనీ ఆఫర్‌

ఉద్యోగుల ఆరోగ్యంపై సౌత్‌కొరియాలోని ఓ కంపెనీ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. రెండు నెలలు క్రమం తప్పకుండా వర్కౌట్‌ చేసే ఉద్యోగులకు గూచీ, షనెల్‌, ప్రదా వంటి లగ్జరీ బ్రాండ్ల గిఫ్ట్స్‌ ఇస్తోంది. ఇందుకోసం ఉద్యోగులు తమ ఎక్సర్‌సైజ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను మేనేజర్‌కు పంపాలి. సియోల్‌లో పనిచేస్తున్న భారతీయ కంటెంట్‌ క్రియేటర్‌ మాన్సి ఆరోరా ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వీడియో వైరల్‌గా మారింది. ఉద్యోగుల్లో ఫిట్‌నెస్‌ పెంచేందుకు కంపెనీ చేస్తున్న ప్రయత్నంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

వెల్‌నెస్‌ పేరుతో విటమిన్‌ డ్రిప్స్‌.. నిజంగా అవసరమేనా?
Health· 16h ago

వెల్‌నెస్‌ పేరుతో విటమిన్‌ డ్రిప్స్‌.. నిజంగా అవసరమేనా?

ఆరోగ్యంగా ఉండేందుకు ఇప్పుడు కొత్త కొత్త వెల్‌నెస్‌ ట్రెండ్స్‌ అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా విటమిన్‌ ఇన్ఫ్యూషన్స్‌, IV డ్రిప్స్‌ తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. సాధారణంగా ఎమర్జెన్సీ మెడికల్ కేర్, తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఉపయోగించే వీటిని వెల్‌నెస్‌ కోసం తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మందులు, ట్రీట్‌మెంట్లపై జరిగే తప్పుడు ప్రచారం కూడా ప్రజల నిర్ణయాలను ప్రభావితం చేస్తోందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. డాక్టర్ సలహాతోనే విటమిన్ డ్రిప్స్ తీసుకోవాలి.