11న APWJF పల్నాడు జిల్లా ప్రథమ మహాసభ

పల్నాడు జిల్లా దాచేపల్లిలో APWJF గురజాల నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశానికి APWJF రాష్ట్ర ఉపాధ్యక్షులు BN ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ నెల 11న నిర్వహించనున్న APWJF పల్నాడు జిల్లా ప్రథమ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని APWJF సభ్యులు, జర్నలిస్టులు పెద్దసంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. మహాసభకు జిల్లా మంత్రి, MLAలు, మాజీ MLAలు, కలెక్టర్, SPతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నట్లు తెలిపారు.


