ఇది రోడ్డే.. మొత్తం బురదమయం
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని బూసిపుట్టు–గిన్నెలకోట రహదారి వర్షాలకు బురదమయంగా మారి వాహనాలు కూరుకుపోతున్నాయి. ఈ మార్గంపై సుమారు ఐదు పంచాయతీల ప్రజలు ఆధారపడి ఉన్నారు. వర్షాలు కురిసిన ప్రతిసారీ రహదారి అధ్వానంగా మారడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు తెలిపారు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నామని చెప్పారు. వాహనాలు బురదలో కూరుకుపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.



