Dutyలో ఉన్న పోలీస్‌పై చేయిచేసుకున్న MLA కూతురు
కర్ణాటకలో బీజేపీ MLA కూతురు మహిళా పోలీస్ ఆఫీసర్‌పై దాడి చేశారు. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. తుమకూరు రూరల్ MLA సురేశ్ గౌడ కూతురు ఐశ్వర్య.. మండ్య జిల్లాలోని శ్రీరంగపటణ టెంపుల్‌లో డ్యూటీలో ఉన్న మహిళా SI సవితాతో గొడవ పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమెను తిట్టి, చెంపదెబ్బ కొట్టినట్లు పోలీసుల తెలిపారు. దర్శనం కోసం క్యూలో వెళ్లాలని పోలీసులు చెప్పడంతో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు బుక్ చేశారు. దీంతో ఎమ్మెల్యే సురేశ్ గౌడ ఈ వివాదంపై క్షమాపణలు(Apologises) చెప్పారు.



