గద్వాలలో ప్రేమ పెళ్లి.. అబ్బాయి ఇల్లు కూల్చివేత

జోగులాంబ గద్వాల జిల్లా రేపల్లెలో మేజర్లు అయిన ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఇంటర్‌కాస్ట్ మ్యారేజ్ నచ్చని అమ్మాయి ఫ్యామిలీ, విలేజ్ సర్పంచ్ సపోర్ట్‌తో అబ్బాయి ఇళ్లను వాహనాలు, గడ్డపారలతో నేలమట్టం చేశారు. కుల వివక్షతో ఈ దాడికి పాల్పడిన సర్పంచ్‌పై SC ,ST అట్రాసిటీ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని MRPS నేత పోగుల రాజేష్ డిమాండ్ చేశారు. అరెస్ట్ చేయకపోతే సెప్టెంబర్ 18న కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు.


