← Back to news

APలో లోకల్ బాడీ ఎలక్షన్స్ హీట్.. మరో బిగ్ అప్‌డేట్!

By Mahesh· 2h ago· AP
APలో లోకల్ బాడీ ఎలక్షన్స్ హీట్.. మరో బిగ్ అప్‌డేట్!

AP: రాష్ట్రంలో లోకల్ ఎలక్షన్స్‌కు SEC స్పీడ్ పెంచింది. రీసెంట్‌గా 41 అర్బన్ లోకల్ బాడీస్‌కు ఫోటో ఓటర్ లిస్టులు రెడీ చేయాలని నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీలు, నగర్ పంచాయతీలు ఉన్నాయి. జనవరి 1ని క్వాలిఫైయింగ్ డేట్‌గా నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల ఓటర్ లిస్ట్ ఆధారంగా లిస్ట్‌ను రెడీ చేయనున్నారు. ఫైనల్ ఓటర్ లిస్టులను ఈ నెల 22న పబ్లిష్ చేయనున్నారు. ఇప్పటికే మరో 59 మున్సిపాలిటీలకు కూడా నోటిఫికేషన్ రావడంతో త్వరలోనే మున్సిపల్ ఎలక్షన్స్ జరిగే ఛాన్స్ కనిపిస్తోంది.

More in AP