ట్యాంక్ బండ్‌పై ఫ్లెక్సీలు.. గణేష్ నిమజ్జనానికి నో!

TG: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనంపై పోలీసులు అలర్ట్ అయ్యారు. హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP) విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని భక్తులు, నిర్వాహకులకు క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనానికి నో చెప్పిన పోలీసులు, నెక్లెస్ రోడ్ వైపు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అప్పర్ ట్యాంక్ బండ్‌పై గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దంటూ GHMC, పోలీస్ శాఖ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలనే పెట్టాలని సూచించారు.



