5వేలకు పైగా Gmail అకౌంట్లు.. సైబర్ రాకెట్ గుట్టురట్టు!

ఫేక్ బాంబ్ థ్రెట్ మెయిల్స్ వెనుక భారీ సైబర్ రాకెట్‌ను గుజరాత్ పోలీసులు బయటపెట్టారు. 2022 నుంచి 5,13,847 ఫేక్ Gmail అకౌంట్లు క్రియేట్ చేసిన ఇంటర్నేషనల్ నెట్‌వర్క్‌ను గుర్తించారు. ఈ అకౌంట్లను విదేశాల్లోని బయ్యర్స్‌కు బ్యాచ్‌లుగా అమ్మి, క్రిప్టోలో పేమెంట్స్ తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. సెప్టెంబర్ 10న గుజరాత్ ప్రభుత్వానికి వచ్చిన ఫేక్ మెయిల్‌తో ఈ రాకెట్ బయటపడింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో అకౌంట్లు ఎలా క్రియేట్ చేశారనే దానిపై ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది.



