గిద్దలూరులో చిరుత ఉంది..అలెర్ట్..!

ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలోని దిగువమెట్ట, ప్రతాప్‌రెడ్డి కాలనీ, పెద్దచెరువు, జయరాపురం, జయరాపురం తండా, ఎల్లుపల్లి, ఉప్పలపాడు, అంబవరం గ్రామాల పరిసర రిజర్వు ఫారెస్ట్‌లో చిరుతపులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ గుర్తించింది. ఈ ప్రాంతాల ప్రజలు, రైతులు, పశువుల కాపలాదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రిజర్వు ఫారెస్ట్‌లోకి ప్రవేశించకూడదు. ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో ఒంటరిగా సంచరించకూడదన్నారు. చిరుత కనిపించినా, ఆనవాళ్లు గుర్తించినా వెంటనే సమీప అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు.



