'ఏందయ్య సామీ' ఫుల్ సాంగ్ వచ్చేసింది!
ఆరు నెలల క్రితం 'రణబాలి' సినిమా నుంచి రిలీజైన 'ఏందయ్య సామీ' చిన్న బీట్ సాంగ్ ఇంటర్నెట్‌లో ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ ఫుల్ సాంగ్‌ను మూవీ టీమ్ అధికారికంగా విడుదల చేసింది. 'అమ్మో.. అలివో.. నువ్వు ఎవరో గానీ' అంటూ రణబాలి, జయమ్మల లవ్ అండ్ బాండింగ్‌ను తెలిపేలా ఈ పాట లిరిక్స్ ఉన్నాయి. విజయ్ దేవరకొండ, రష్మిక కాంబోలో వస్తున్న ఈ గ్రాండ్ మూవీ అక్టోబర్ 16న థియేటర్లలో రిలీస్ కానుంది.



