ఇక్కడ శాతవాహన ఆపాల్సిందే.. ప్రజల డిమాండ్

మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో అక్టోబర్ 2న రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, డీఆర్‌ఎం గోపాలకృష్ణన్ పర్యటించారు. గార్ల రైల్వే స్టేషన్‌లో శాతవాహన ఎక్స్‌ప్రెస్ హాల్ట్ ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరారు. ప్లాట్‌ఫారాలు పెంచాలని, పెండింగ్‌లో ఉన్న స్టేషన్ వరండా నిర్మించాలని డిమాండ్ చేశారు. ఉదయం ప్యాసింజర్ రైలును కొనసాగించాలని కూడా కోరారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌సీసీ, రైల్వే బోర్డు కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.



