← Back to news

శనివారం విద్యుత్ కట్.. తాడేపల్లి, ప్రాతూరు అలర్ట్!

By BUJJIBABU· 2h ago· Salivahanapeta, Mangalagiri, Guntur
శనివారం విద్యుత్ కట్.. తాడేపల్లి, ప్రాతూరు అలర్ట్!

తాడేపల్లి, ప్రాతూరు పరిధిలో శనివారం (అక్టోబర్ 3) విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. లైన్ల నిర్మాణ పనుల కారణంగా ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు కరెంట్ ఉండదు. విద్యుత్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కే. అనిల్‌బాబు ప్రకటనలో ఈ విషయం తెలిపారు. వినియోగదారులు గమనించి సిబ్బందికి సహకరించాలని కోరారు. నిర్ణీత సమయం తర్వాత సరఫరా పునరుద్ధరిస్తామని తెలిపారు.

More in Local