← Back to news

49 ఏళ్లుగా గణేష్ ఉత్సవాలు..!

By Surender· 5h ago· Jadcherla, Jadcherla, Mahabubnagar
49 ఏళ్లుగా గణేష్ ఉత్సవాలు..!

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండపంలో 49వ సంవత్సరం గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. కరాటే శ్రీను, కొంగాలి మోహన్‌రాజ్, యువ నాయకుడు కొంగాలి శ్రీకాంత్, KSF టీమ్ సభ్యులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారు స్వామివారికి పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రజలకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు. భక్తులు, యువకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

More in Local